
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
ఆలూరు రూరల్: కారు, మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని హులేబీడు సమీపంలోని హైవే–167లో మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. బళ్లారికి చెందిన రంగప్రసాద్ కుటుంబంతో కలిసి ఎమ్మిగనూరు నుంచి కారులో బళ్లారికి వెళ్తున్నాడు. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన మినీ లారీ కందుల లోడుతో ఆదోనికి వెళ్తోంది. హులేబీడు గ్రామ సమీపంలో కారు, మినీ లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రంగప్రసాద్ చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. భార్య అనురాధ, కుమారులు గౌతం రంగ, మౌనిత్ రంగకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే మినీలారీ డ్రైవర్ ప్రతాప్, కందులను విక్రయించేందుకు వెళ్తున్న రైతు గాదిలింగకు గాయాలయ్యాయి. అక్కడున్న వారు క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు