
మంత్రాలయంలో కన్నడ సినీ నటులు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై కన్నడ సినీ నటులు మంత్రాలయం వచ్చారు. ఆదివారం రాత్రి కన్నడ సినీ నటుడు ఉపేంద్ర కుటుంబ సభ్యులు, కన్నడ సినీ నటి శ్రీమతి తార వేర్వేరుగా మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంధ్ర తీర్థులు నటులకు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూలమంత్రాక్షితులతో ఆశీర్వాదం చేశారు.

మంత్రాలయంలో కన్నడ సినీ నటులు