
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్.వి.ఎస్ గురువయ్యశెట్టి తెలిపారు. శనివారం స్థానిక ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్షలకు ఫస్ట్ ఇయర్ చెందిన 16,292 మంది, సెకండ్ ఇయర్‌కు చెందిన 5032 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. జిల్లాలో 7 కేంద్రాలు సమస్యాత్మకమై కేంద్రాలు గుర్తించామని, వీటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్షలపై ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 08518–222047 నంబరును సంప్రదించవచ్చునని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ మాత్రమే తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఈసీ మెంబర్లు జి.లాలెప్ప, యు.పద్మావతి, జి.ఎస్ సురేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహణ
ఇంటర్ బోర్డు
ప్రాంతీయ కార్యాలయ అధికారి