
భార్య హత్యకేసులో భర్త అరెస్టు
బేతంచెర్ల: పట్టణంలోని గౌరిపేటలో ఈనెల 9న షేక్ జకీయా బేగంను హత్య చేసిన కేసులో ఆమె భర్త షేక్ రసూల్‌ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌ల్లో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడైన షేక్ రసూల్ కోసం గాలింపు చేపట్టి బనగానపల్లె రహదారిలోని చెలిమె వద్దనున్న మౌలాలి స్వామి దర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. ఎస్‌ఐ రమేష్‌బాబు, పోలీస్ సిబ్బంది రాఘవేంద్ర, దస్తగిరి, చంద్రశేఖరప్ప, మహేష్ పాల్గొన్నారు.