
గ్రామం నుంచి పారా మిలటరీలో మొట్టమొదటి మహిళను
మాది వ్యవసాయం కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న జయరాముడు. తొమ్మిదేళ్ల క్రితం నాన్న చనిపోయారు. నాకు అక్క పద్మావతి, తమ్ముడు వేణు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఊరి నుంచి మిలిటరీకి వెళ్లిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నా. ఆ దిశగా చేసిన ప్రయత్నంతోనే న్యూ ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ జవాన్‌గా పనిచేసేందుకు అవకాశం దక్కింది. మా గ్రామం పారా మిలటరీలో చేరిన మొట్టమొదటి మహిళను కావడం ఎంతో గర్వంగా ఉంది. తల్లి, అక్క, తమ్ముడుతో పాటు భర్త ప్రోత్సాహం మరువలేనిది. దేశం కోసం పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. – జరగల స్వాతి, సీఐఎస్‌ఎఫ్, అమినాబాద్