
రోగంతో బాధపడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆ
క్యాజువాలిటీలో రోగులకు
చికిత్స చేస్తున్న నర్సులు (ఫైల్)
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 776 మంది వివిధ రకాల హోదాల్లో నర్సులు పనిచేస్తున్నారు. వీరే గాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 1200 మందికి పైగా నర్సులు సేవలందిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 2వేల మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు గ్రామాల్లో 400లకు పైగా కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు(ఎంఎల్‌హెచ్‌పీలు), వెయ్యి మంది దాకా ఏఎన్‌ఎంలు నర్సింగ్ సేవలు అందిస్తున్నారు. గత రెండు వారాలుగా జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సీహెచ్‌వోలు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలకు వెళ్తున్నారు. సాధారణంగా వైద్యులు రోగికి అవసరమైన పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే ఆ తర్వాత ఆ చికిత్సను పర్యవేక్షించాల్సిన బాధ్యత నర్సులదే. రోగికి మందులు అందించడంతో పాటు అవసరమైతే వారికి సపర్యలు కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో ఓపిక, సహనం అవసరం. ఈ మేరకు అవసరమైన మెళకువలన్నీ నర్సింగ్ విద్యలో వారికి నేర్పిస్తారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు
నర్సింగ్ వృత్తి వ్యవస్థాపకులు మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820వ సంవత్సరం మే 12వ తేది ఇటలీ దేశ సందర్శనకు వెళ్లిన సమయంలో ఇంగ్లిష్ దంపతులకు జన్మించారు. నైటింగేల్ బాగా ఆర్థిక, ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించిన కారణంగా ఆ తరంలోనే ఆమె స్కూల్ స్థాయి వరకు చదువుకున్నారు. క్రిమియన్ యుద్ధ సమయంలో క్షతగాత్రులకు ఆమె అందించిన వైద్యసేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆమెకు లేడి ఆఫ్ ల్యాంప్ అవార్డునిచ్చి సత్కరించింది. ఆ తర్వాత ఆమె లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో నైటింగేల్ స్కూల్‌ను ప్రారంభించింది. నర్సింగ్ వృత్తికి ఆమె చేసిన సేవలకు గాను ప్రతి సంవత్సరం ఆమె జయంతి మే 12వ తేదిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా పాటిస్తున్నారు.
సేవకు ప్రతిరూపం నర్సులు
రోగుల చికిత్సలో
వైద్యుల తర్వాత వారే
జిల్లా వ్యాప్తంగా
4 వేల మంది నర్సులు
గ్రామాల్లో సీహెచ్‌ఓలదే ముఖ్యపాత్ర
వైద్యుల తరహా సేవలందిస్తున్న వైనం
నేడు అంతర్జాతీయ
నర్సుల దినోత్సవం