
వైభవంగా పట్టాభిషేక మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాన్ని స్వామిజీ సుబుధేంద్రతీర్థులు అధిరోహించి 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిజీ పూజా మందిరంలో రాములోరి సంస్థాన పూజలో తరించారు. పట్టాభిషేక దినాన్ని పురస్కరించుకుని యాగశాలలో మృత్యుంజయ, ఆయుష్షు, మార్కండేయ హోమాలు చేపట్టారు. వాస్తు పూజతోపాటు హోమాల పూజల్లో పీఠాధిపతి పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో లోక కళ్యాణార్థం హోమాలు చేసినట్లు స్వామిజీ తెలిపారు. భారత్ సైనికులు సురక్షితంగా ఉండాలని, విజయం వరించాలని కోరారు.
లోక కళ్యాణార్థం హోమాలు