
కౌతాళంలో ప్రసాదం పంపిణీ
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసులో భాగంగా సోమవారం కౌతాళంలో సఫ్‌రాలుట్‌న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదర్థాన్ని డప్పువాయిద్యాల మధ్య దర్గాకు తీసుకొచ్చారు. ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనల అనంతరం ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ప్రసాదాన్ని ముగ్గురు భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం పొలంలో పాతితే పంట బాగా పండుతుందని, రోగం ఉన్నవారు తింటే వారికి రోగం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ ప్రసాదం కోసం పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ అశోక్‌కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించారు.