
మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం
కర్నూలు(టౌన్): చిలకలూరి పేటలో మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరును దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు శశికళ అన్నారు. కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొనినిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మహిళలపై అమానీయంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖపై చర్యలు తీసుకోవడంలో సాటి మహిళా హోంమంత్రి అనిత ఘోరంగా విఫ లం చెందారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పనపై రాత్రికి రాత్రి కేసు పెట్టి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. రౌడీలా వ్యవహరించిన సీఐ సుబ్బరాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. ఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు భారతి, నగర అధ్యక్షురాలు మంగమ్మ, 4 వ వార్డు కార్పోరేటర్ ఆర్షియా ఫర్హీన్ పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన