
ఇప్పుడు విధుల్లో 15 మంది..
అమినాబాద్ గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. గ్రామం నుంచి మచ్చా రంగనాయకులు, సురేంద్ర, కురవ వంశీ, దాసరి ప్రభాకర్, ఎంబాయి విజయ్‌కుమార్, రమేష్, పురిమెట్ల హరి, దండు రామాంజిని, రాజు, తిమ్మాపురం హనుమేష్, బాలకృష్ణ, కె.హరినాథ్, సుద్దాల మురళి, జరగల స్వాతి, గొల్ల రాధ(ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బి, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ) విభాగాల్లో పని చేస్తున్నారు. ఇక దివాకర్‌చౌదరి, లక్ష్మినారాయణ, మండపాటి వెంకటేశ్వర్లు, దాసరి రంగడు, మచ్చా నాగరాజు, హరినాథ్, మోటుపల్లి కరుణాకర్, రాము, నవీన్, నాగరాజు ఆర్మీ, బీఎస్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. గ్రామం నుంచి పలువురు యువకులు దేశ రక్షణకు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ ఊరికి వన్నె తెచ్చారని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వీరిలో పలువురిని ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు విధుల్లో 15 మంది..

ఇప్పుడు విధుల్లో 15 మంది..