
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
మహానంది: నంద్యాల – గిద్దలూరు రహదారిలో గురువారం రాత్రి బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె మండలం బీరవోలు గ్రామానికి తలారి వేణు(18), మధుకృష్ణ బైక్‌పై గాజులపల్లెలో బంధువుల ఇంట్లో జరుగుతున్న తిరుగు పెళ్లికి బయలుదేరారు. ఈ క్రమంలో బోయిలకుంట్ల మెట్ట వద్ద గంగవరం గ్రామానికి చెందిన తెలుగు రమణ, బాలు మరో బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తూ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బీరవోలు గ్రామానికి చెందిన తలారి వేణు మృతి చెందగా రమణ, బాలు, మధుకృష్ణ గాయపడ్డారు. రోడ్ సేఫ్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి, కుటుంబీకులకు సమాచారం అందించారు.