
కూతురుకు భారం కాకూడదని..
వెల్దుర్తి: అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి కుమార్తె, అల్లుడుకి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన డి చిన్నబాబు(42) పాలీస్ బండల ఫ్యాక్టరీలు కూలీగా జీవించేవాడు. ఒక్కగానొక్క కుమార్తె అమ్రిన్‌ను వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఇటీవల చిన్నబాబు పక్షవాతంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పులు ఎక్కువై స్వగ్రామంలో ఉన్న ఒక్క ఇంటిని అమ్మి భార్యతో కలిసి కుమార్తె, అల్లుడు వద్దకు చేరుకున్నారు. అనారోగ్యంతో వారికి భారమవడం ఇష్టంలేని చిన్నబాబు బుధవారం రాత్రి బయటకు వచ్చి గురువారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కర్నూలు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐలు ప్రేమ్‌కుమార్, రమేశ్‌లు సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. రాత్రి గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, కర్నూలు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తండ్రి ఆత్మహత్య