డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

May 20 2025 1:26 AM | Updated on May 20 2025 1:26 AM

డిగ్ర

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఫిబ్రవరి/మార్చి నెలల్లో జరిగిన డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ (2015, 2016, 2017,2018) పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

22న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కర్నూలు(అర్బన్‌): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని మండల పరిషత్‌ సమావేశ భవనంలో అందించనున్నట్లు జిల్లా కురువ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఎంపికై న విద్యార్థులందరికీ జ్ఞాపిక, సర్టిఫికెట్లు, నగదు బహుమతులను అందిస్తామన్నారు. సమావేశంలో సంఘం అసోసియేట్‌ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా భువనేంద్రుల ఆరాధన

మంత్రాలయం: మధ్వమత పూర్వపు పీఠాధిపతి భువనేంద్రుల ఆరాధన వేడుక వైభవంగా జరిగింది. తెలంగాణలోని రాజోలి గ్రామంలో క్షేత్రంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు చేపట్టారు. ముందుగా భువనేంద్ర తీర్థుల మూల బృందావనానికి శాస్రోక్తంగా విశేష పూజలు చేశారు. అక్కడే శ్రీమఠం రాములోరి సంస్థాన పూజలు నిర్వహించారు. ఈ ఆరాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలో పండిత కేసరి రాజా ఎస్‌. గిరియాచార్‌, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి

బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్‌ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు.

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

హాలహర్వి: హత్య కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. హాలహర్వి పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్‌ చేసిన నిందితులను చూపుతూ సీఐ వివరాలను వెల్లడించారు. అమృతాపురం గ్రామంలో గత నెల 25న కంటినేని పెద్ద వెంకటేశులు హత్యకు గురి కాగా నిందితుడు సోమన్నను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. కుటుంబ కలహాల కారణంగా కంటినేని పెద్ద వెంకటేశులను హతమార్చినట్లు సోమన్న ఒప్పుకున్నారన్నారు. హత్యలో భాగస్వాములైన హొళగుంద గ్రామస్తులు చాకలి నాగరాజు, నటరాజగౌడ, కర్ణాటక రాష్ట్రం ఉత్తనూరుకు చెందిన భోగప్ప, ధనుంజయ, దళిత ఈరన్నను విరుపాపురం గ్రామ శివారులోని బల్గోట బసవేశ్వర ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. హాలహర్వి ఎస్‌ఐ చంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల 1
1/2

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల 2
2/2

డిగ్రీ స్పెషల్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement