
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి ఉరుసు
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఆదివారం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తి ఇంటి నుంచి గంధం తీసుకెళ్లారు. డప్పువాయిద్యాలు, బ్యాండు మేళాల మధ్య ఈ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా ఫక్కీర్లు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరిన అనంతరం ధర్మకర్తతో కలిసి దర్గా పీఠాధిపతి ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించారు. దీంతో ఉరుసు ప్రారంభమైనట్లు ప్రకటించారు. కాగా ఈఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త పూర్థిసాయిలో ఏర్పాట్లు చేశారు. దర్గాలో ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి వరకు తగ్గలేదు. దర్శనం కోసం గంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గంధం ఉత్సవానికి తరలివచ్చిన
దర్గా పీఠాధిపతులు
గంధం ఉత్సవానికి వివిధ దర్గాల పీఠాధిపతులు తరలివచ్చారు. బీదర్, రాయచూర్, సిందనూర్, కర్నూలు ఖాలిక్ లింగ దర్గాల పీఠాధిపతులు స్వామి సన్నిధిలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో కర్ణాటకలోని సర్మస్‌వలి దర్గా నిర్వాహకుడు దూద్‌బాష, తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఆకట్టుకున్న ఫక్కీర్ల విన్యాసాలు

ఘనంగా ఖాదర్‌లింగ స్వామి ఉరుసు