
నడిచి వెళ్లాలి
మా గ్రామానికి అసలు బస్సు సౌకర్యమే లేదు. మా గ్రామస్తులు ఎక్కడికై నా నడిచి వెళ్లాల్సి వస్తోంది. హంద్రీ నది దాటి గోరంట్ల గ్రామానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి వెల్దుర్తి, కోడుమూరు, కర్నూలుకు బస్సులు ఉన్నాయి. వర్షాలు వచ్చి హంద్రీ నది వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. – కృష్ణయ్య, ఎస్‌హెచ్ ఎర్రగుడి
ఒక్క బస్సు లేదు
గతంలో డోన్ నుంచి ఓబులాపురం మీదుగా మా గ్రామం నుంచి కోడుమూరుకు ప్రతి రోజూ ఐదు సార్లు బస్సులు తిరిగేవి. ఇప్పుడు ఒక్క బస్సు సౌకర్యం లేదు. డోన్‌కు రావాల న్నా, మండల కేంద్రమైన కృష్ణగిరి వెళ్లాలన్నా ఆటోలు దిక్కు అవుతున్నాయి. బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – రామచంద్రుడు, కటారుకొండ
చర్యలు తీసుకుంటాం
డోన్ బస్సు డిపో పరిధిలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండల్లాలోని పలు గ్రామాలకు గతంలో బస్సులు తిరిగేవి. కానీ ఆ దారుల్లో ఆటోలు ఎక్కవ కావడంతో బస్సు సర్వీసులు నిలిపివేశారు. ఇప్పుడు మరోమారు ఆ దారుల్లో అవసరాన్ని బట్టి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం.
– శశిభూషణ్, ఆర్డీసీ డీఎం, డోన్

నడిచి వెళ్లాలి