Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Vallabhaneni Vamsi Mohan Met YS Jagan Convey Thanks1
వైఎస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్‌ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్‌ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

TDP leaders attack YSRCP Sarpanch Nagamalleswara Rao in Guntur District: AP2
మన్నవ సర్పంచ్‌పై హత్యాయత్నం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్‌ మాట్లాడితే రెడ్‌ బుక్‌ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వర­రావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్‌కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్‌ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్‌ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్‌లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. పొలిటికల్‌ గవర్నెన్స్‌ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్‌సెట్‌) నాగమల్లేశ్వరరావు(ఫైల్‌)

Mallikarjuna Kharge with leaders aspiring for ministerial posts3
సారీ.. వచ్చేసారి.. మంత్రి పదవులు ఆశించిన నేతలతో ఖర్గే

సాక్షి, హైదరాబాద్‌: అర్హులైన నేతలు మంత్రి పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే పార్టీ అంతర్గత పరిస్థితులు రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సముచిత న్యాయం చేసేందుకు పార్టీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో వారి వారి అనుభవం, అర్హతలకు అనుగుణంగా పదవులు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం జరగనున్న పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, పార్టీ నేత హర్కర వేణుగోపాలరావు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేరుగా తాను బస చేసే తాజ్‌ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్‌ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. మేం అర్హులం.. మాకు అవకాశం ఇవ్వాల్సిందే ఏఐసీసీ చీఫ్‌తో భేటీ అయ్యేందుకు రావాలని గురువారం మధ్యాహ్నం కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు సుదర్శన్‌రెడ్డి, ప్రేంసాగర్‌ రావు, బాలునాయక్, రామ్మోహన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి సాయంత్రం హోటల్‌కు చేరుకుని ఖర్గేతో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఆది శ్రీనివాస్‌కు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నియోజకవర్గాల్లో ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున వారు రాలేకపోయారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు.. తమకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలో, తాము ఎలా అర్హులమో వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పార్టీ పట్ల విధేయతో ఉంటున్నామని, తమకు ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిందేనని కోరారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, ఆ రెండు జిల్లాలకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడండి ..గెలిచి రండి అందరి వాదనలను సావధానంగా విన్న ఖర్గే..ఎమ్మెల్యేల వినతులను పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అర్హులైన వారికి కూడా కొన్ని పదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీలును బట్టి పార్టీలో ప్రాధాన్యమిస్తామని, సీనియారిటీని తప్పకుండా గౌరవిస్తామని, సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని అప్పుడు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని, మెజార్టీ స్థానాల్లో గెలవాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఖర్గే సమావేశం కొనసాగుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోటల్లోనే ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడికి వచ్చిన ఆయన.. 9 గంటల తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. ఖర్గేతో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత సీఎంను కూడా కలిశారు. తమకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలో, ఖర్గేకి ఏం చెప్పామో వివరించారు. 9 దాటిన తర్వాత హోటల్‌ నుంచి రేవంత్‌ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌ కూడా హోటల్లో కొంతసేపు ఉండి ఆ తర్వాత శుక్రవారం నాటి సమావేశాలు, సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లారు. కాగా సీఎంను కలిసేందుకు మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ హోటల్‌కు రాగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. చీఫ్‌ విప్‌ ఆఫర్‌ చేసినా.. తాను పార్టీ కోసం చేసిన కృషిని, పార్టీ పట్ల విధేయతను వివరించినప్పటికీ మంత్రి పదవిపై సరైన భరోసా లభించకపోవడంతో అలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు హోటల్‌ నుంచి విసురుగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆయనకు చీఫ్‌ విప్‌ పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా ప్రేంసాగర్‌ రావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ప్రేంసాగర్‌ రావు.. తాను అలిగాననడంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ అధ్యక్షుడికి తన మనసులో మాట చెప్పి వెళ్లిపోయానని చెప్పారు. కొండా మురళి దంపతుల వివరణ వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా ఖర్గేను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో విభేదాలపై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్‌ జానయ్య, రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరు మురళిలు కూడా ఖర్గేతో కాసేపు సమావేశం అయ్యారు. ఖర్గేతో భేటీ అనంతరం ఎవరేమన్నారంటే.. ఉమ్మడి జిల్లాలన్నింటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరినట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ‘పార్టీలో సీనియర్లం ఉన్నాం..మంత్రి పదవి ఇవ్వాలని కోరా..’ అని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారని బాలునాయర్‌ తెలిపారు. తాను మంత్రి పదవికి ఎలా అర్హుడనో ఖర్గేకి వివరించానని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తనది నాలుగు తరాల విధేయత అని చెప్పానన్నారు. నేడు వరస సమావేశాలు మల్లికార్జున ఖర్గే శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Sakshi Editorial on Foreign Ministers Meeting of quad countries4
నీళ్లు నమిలిన క్వాడ్‌!

అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్‌) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మొన్న ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్‌ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్‌ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్‌గామ్‌ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్‌ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్‌లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్‌ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్‌ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్‌ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్‌ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్‌ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్‌గామ్‌ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్‌ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్‌ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్‌గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్‌ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్‌ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్‌ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది.

Sakshi Guest Column On Nuclear power5
‘అణు వివక్ష’ అంతమయ్యేనా?

భారత అణు కేంద్రాలు ఏపాటి సురక్షితమైనవి? చెర్నోబిల్‌ అణు కేంద్ర ప్రమాదం (1986) తర్వాత భారత్‌ అణుశక్తి సంస్థ అధిపతికి ఈ ప్రశ్న ఎదురైంది. ‘‘మన అణు కేంద్రాలు ఎంత సురక్షితమైనవంటే వాటిని ఒక క్షిపణి తాకినా, విమానం వాటిపై కూలినా అవి చెక్కుచెదరవు’’ అని ఆయన జవాబిచ్చారు. అణు విద్యుత్‌ కేంద్రాన్ని లేదా తత్సంబంధిత సదుపాయాలను నెలకొల్పేటప్పుడు యుద్ధంతో సహా ఎటువంటి విపత్తు సంభవించినా తట్టుకుని నిలబడేటట్లు అణు ఇంజనీర్లు ప్లాన్‌ చేస్తారు. ఏ అణు సదుపాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడైనా దాని భద్రతకు ప్రధానంగా పూచీ వహేంచే అంశం ఏదైనా ఉందీ అంటే అది దానిని ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆ భౌగోళిక ప్రాంతమే. భౌగోళిక సుస్థిరతతోపాటు జనావాసాలకు దూరంగా ఉండటం ముఖ్యం. సాధారణంగా అటువంటి సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంటాయి. అణుదాడులు బాధ్యతారాహిత్యంఇరాన్‌లోని ఫర్దో, నతాంజ్, ఇస్‌ఫహాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్‌ ఇటీవల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫర్దో యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇరాన్‌ కేంద్ర ప్రాంతంలో పర్వతాల లోపల లోతున నిర్మించారు. యరేనియం శుద్ధి కేంద్రాలు, ఇంధన కడ్డీల తయారీ యూనిట్లు, విద్యుదుత్పాదన కేంద్రాలు, వ్యర్థాలను భద్రపరచే ప్రదేశాలు వంటి అణు సదుపాయాల భద్రత... అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆందోళనకర అంశంగానే ఉంటూ వస్తోంది. యాదృచ్ఛికంగానైనా లేదా ఉద్దేశపూర్వకంగానైనా ఎలాంటి ప్రమాదం సంభవించినా అది అణు ధార్మికత విడుదలకు కారణమై అటు మానవాళికి, ఇటు పర్యావరణానికి హానికరంగా పరిణమించవచ్చు. ఇటీవలి ఘర్షణలో ఆ మూడు చోట్ల వైమానిక దాడుల్లో అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా, వాటి చుట్టూ ఉన్న ఇతర సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధంలో ఈమధ్య ఉక్రెయిన్‌లోని జపొరియిష వంటి అణు సదుపాయాలు దాడులకు లోనుకావచ్చని వాటి భద్రతపై ఆందోళన నెలకొంది. అలాగే, ఉత్తర కొరియా కూడా అణు బూచికి చిరునామాగా మారింది. పైగా, అది అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం లేదు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇలాంటి విషయాల్లో ప్రపంచ పెద్దమనిషిగా వ్యవహరించవలసి ఉంది. అణు విచ్ఛిత్తి పదార్థాల రవాణాతోపాటు, అణు ధార్మికతకు దారితీయగల ప్రమాదాలపై అది ఒక కన్ను వేసి ఉంచుతుంది (తాజాగా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్‌ నిర్ణయించింది). ఒక రియాక్టర్‌ పై దాడి జరిగి, అది ధ్వంసమైతే దాని నుంచి విడుదలయ్యే అణు ధార్మికత సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనల్లో అదే జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణలు సాగుతున్నప్పుడు ఏ పక్షమైనా సరే రెండవ పక్షానికి చెందిన అణు రియాక్టర్‌పై దాడికి దిగినా, ధ్వంసం చేసినా అది సదరు దేశం పక్షాన పూర్తి బాధ్యతారాహిత్యం అవుతుంది. అసమానతే అంతస్సూత్రమా?రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో సైన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. ఐఏఈఏ 1957లో ఏర్పడడానికి ప్రేరణ ఇచ్చిన అంశాల్లో అది కూడా ఒకటి. ప్రభుత్వాలనన్నింటినీ ఒకచోట చేర్చడం, టెక్నాలజీ అంశాలపై వాటికి దారి చూపడం, అణు శక్తి శాంతియుత ప్రయోజనాలపై సమాచారాన్ని క్రోఢీకరించడం అనే భావనతో అది ఏర్పడింది. ఐఏఈఏ ఏర్పాటుకు దారితీసిన చర్చల్లో భారత్‌ కూడా పాల్గొంది. అందులో భారత్‌ వ్యవస్థాపక సభ్యురాలు. కొన్ని దశాబ్దాలుగా, ఆ సంస్థ గవర్నర్ల బోర్డులో సభ్యురాలిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోంది. అణు శక్తిని ద్వంద్వ ఉపయోగ టెక్నాలజీగా వినియోగిస్తున్నారు. దాంతో, ఆ కార్యకలాపాలు గోప్యంగా సాగుతూ, సమాచార వినిమయం క్లిష్టంగా మారింది. అణు పదార్థాలను సురక్షితంగా వ్యవహరించేటట్లు చూడటంతోపాటు, అణ్వాయుధాల తయారీకి వాటిని బదలాయించకుండా నివారించడం కూడా ఐఏఈఏ ప్రధాన కర్తవ్యం. కానీ, ఆది నుంచి కూడా ఈ నిఘా సంస్థ విధి నిర్వహణలో ఒక రకమైన అసమానత అంతర్లీనంగా ఉంటూ వస్తోంది. ఐఏఈఏ వైజ్ఞా్ఞనిక సలహా మండలికి మన హోమి జహంగీర్‌ భాభా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ మండలి, 1960లలో ప్రతిపాదించిన సురక్షితా ప్రమాణాల స్వరూప స్వభావాలపై కఠిన వైఖరిని అవలంబించింది. ఎటువంటి తనిఖీలకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన కొన్ని దేశాలకు ఒక తరహా నిబంధనలు, ఐరోపా దేశాలకు మరో రకమైన నిబంధనలు విధించడాన్ని ప్రశ్నించింది. మిగిలిన దేశాలను మాత్రం కఠినమైన నిరోధాలు, తనిఖీలకు లోనుచేశారు. అణు శక్తి రంగంలో ఐరోపా దేశాలు ఎంతో ప్రగతిని సాధించినందువల్ల వాటి భద్రతను అవి చూసుకోగలవనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అయితే, ఈ వ్యవస్థతో ఏకీభవించనివారు దిగ్భంధనాలను ఎదుర్కోవలసి వస్తోంది. అణు విస్ఫోటనాలను సైనికేతర ప్రయోజనాలకు వినియోగించినా వివాదం నెలకొంటోంది. భారీ స్థాయి ఇంజినీరింగ్, గనుల తవ్వకం, ఇతర తవ్వకాలు లేదా భూగర్భ జలాశయాలను నిర్మించడం వంటివి ఆ కోవలోకి వస్తాయి. ప్రాజెక్ట్‌ రూలిసన్‌ వంటి శాంతియుత విస్ఫోటనాలను అమెరికా నిర్వహించినప్పుడు, వాటిని వైజ్ఞానిక విజయాలుగా జేజేలు కొట్టారు. మన దేశం 1974లో శాంతియుత విస్ఫోటనాన్ని నిర్వహించినపుడు మనపై ఆంక్షలు విధించారు. ఇరాన్‌ అణ్వాయుధాలను నిర్మించగల సామర్థ్యాన్ని సంతరించుకోగల స్థితిలో ఉందనే అభిప్రాయమే ఇరాన్‌ అణు సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులకు కారణం. అందరికీ ఒకే న్యాయంఅణు శక్తి దాని తొలినాటి శాస్త్రీయ సహకార పరిధిని ఏనాడో అతిక్రమించింది. భారీ పారిశ్రామిక కార్యకలాపాలతో అది ఇపుడు ముడిపడి ఉంది. అణు కార్యకలాపాలు అపారమైన ఆర్థిక పెట్టుబడులు, భౌగోళిక రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగినవిగా రూపాంతరం చెందాయి. భారత్‌తో సహా, అనేక దేశాలలో అణు శక్తి రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగిడబోతున్నాయనే మాటలు వినవస్తున్నాయి. ప్రైవేటు అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఐఏఈఏ పర్యవేక్షణలోకి పరోక్షంగా వస్తాయి. అవి దానికి విధేయత చూపేటట్లు చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాల పైనే ఉంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనకు లభించిన సంప్రదాయ సిద్ధమైన నిఘా పాత్రతోపాటు, అలాంటి సవాళ్లకు కూడా ఐఏఈఏ తనను తాను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దేశాలు అణు పదార్థాలను ఆయుధాల తయారీకి తరలించకుండా చూడటం ఆ ఒప్పందం ప్రకారం ఐఏఈఏకి అప్పగించిన ప్రాథమిక కర్తవ్యం. అంతర్జాతీయ సుస్థిరతకు, న్యూక్లియర్‌ టెర్రరిజం బెడదను తగ్గించడానికి పరిస్థితులను సరిచూసే, తనిఖీ వ్యవస్థ కీలకం. కానీ, దాని పనితీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడంలో ఐఏఈఏ పాత్రను చాలా దేశాలు బలపరుస్తున్నాయి. కానీ, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అణు సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికీ సమాన సౌలభ్యం ఉండాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి.దినేశ్‌ సి. శర్మ వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Pak air chief in US after Chinese equipment6
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?

అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో డిన్నర్‌ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్‌ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌సింధూర్‌ తర్వాత పాక్‌ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్‌లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్‌ కొట్టిన దెబ్బతో పాక్‌ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌(ఫైల్‌ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్‌కు భారత్‌ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్‌, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్‌. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్‌ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్‌ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్‌ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్‌ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్‌ ప్రధానిని పక‍్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్‌.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్‌ కొనుగోలుకు ఇప్పటికే పాక్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్‌ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్‌ డిన్నర్‌ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్‌ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్‌ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్‌.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్‌లో పాక్‌ ఆర్మీ అధికారుల దర్శనం​ ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Teen Son of TV Actress Jumps from 57th Floor After Tuition Dispute in Mumbai7
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య

ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్‌ అయ్యారు.

ASP Narayan Barmani sought voluntary retirement after public humiliation by CM Siddaramaiah8
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్‌ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్‌ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్‌ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్‌ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్‌ఎస్‌ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్‌ తర్వాత ఏప్రిల్‌ 28న బెలగావిలో కాంగ్రెస్‌ సంవిధాన్‌ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్‌ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్‌ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్‌ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్‌ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ‌ఏఎస్పీ నారాయణ్‌ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది.

ENG VS IND 2nd Test: India All Out For 587 Runs In First Innings9
ENG VS IND 2nd Test: గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్‌ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్‌ అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్‌.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్‌.. ఇవాళ డబుల్‌ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (101), గిల్‌ (147), పంత్‌ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (137), పంత్‌ (118) శతకాలు చేశారు.

Police Defuse Bombs Seized From Terrorists In Rayachoti10
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం

సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్‌ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్‌ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్‌ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్‌ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్‌ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్‌ అమానుల్లా(55) అలియాస్‌ అబూబకర్‌ సిద్దిక్‌, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్‌ మన్సూర్‌ (47) అలియాస్‌ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్‌ పరికరాలు, కేబుల్స్‌, నెట్‌వర్క్‌ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement