ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Today Telugu Horoscope On July 3rd, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Jul 3 2025 5:31 AM | Updated on Jul 3 2025 8:49 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-07-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.అష్టమి ప.2.39 వరకు, తదుపరి నవమి; నక్షత్రం: హస్త ప.3.07 వరకు, తదుపరి చిత్త; వర్జ్యం: రా.11.55 నుండి 1.41 వరకు; దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు; అమృత ఘడియలు: ఉ.8.36 నుండి 10.22 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు; యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం: 5.33; సూర్యాస్తమయం: 6.35. 

మేషం.... శుభవర్తమానాలు అందుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. బాకీలు వసూలవుతాయి. ఆలయదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం.... వ్యయప్రయాసలు. బంధువిరో«ధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో చికాకులు. ఉద్యోగమార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురవుతాయి.

మిథునం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.  పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

కర్కాటకం... కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వాహనయోగం.

సింహం.... కుటుంబం సమస్యలు. సోదరులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలలో అవరోధాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కన్య.... కొత్త పనులు చేపడతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల.....బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో  అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం....శుభకార్యాల ప్రస్తావన.  మీ అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

ధనుస్సు....దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.

మకరం....ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు చికాకులు.

కుంభం...ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మీనం... దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదే వీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం. సత్కారాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement