హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్‌ కేసు | FIR Against HDFC Bank CEO by Lilavati Hospital Trust Whats Going On | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్‌ కేసు

Jul 3 2025 12:52 PM | Updated on Jul 3 2025 12:52 PM

FIR Against HDFC Bank CEO by Lilavati Hospital Trust Whats Going On

ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్‌ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్‌కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్‌లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.

కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌పై ఇలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’

ట్రస్ట్ ఆరోపణలు..

ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement