breaking news
Shashidar
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్‌లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్‌పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది. -
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
శశిధర్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ సీఎం శశిధర్ కాంస్య పతకాన్ని సాధించాడు. కొచ్చిలో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల ప్లస్ 40 వయో విభాగంలో శశిధర్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో శశిధర్ 21–5, 21–4తో వెగర్ నెస్ (నార్వే)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 21–8, 21–11తో టాప్ సీడ్ లార్స్ కిన్ట్రప్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్లో 21–10, 21–12తో ఐదో సీడ్ కొయెట్శ్రిపన్ (థాయ్‌లాండ్)పై నెగ్గిన శశిధర్... సెమీఫైనల్లో హొసెమారి ఫుజిమోటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇటీవలే జాతీయ సీనియర్ పోటీల్లో శశిధర్ ప్లస్ 40 వయో విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదిచాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో శశిధర్కిది రెండో పతకం కావడం విశేషం. 2013లో ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ పోటీల్లో శశిధర్ ప్లస్ 35 వయో విభాగంలో కాంస్యం సాధించాడు.