శశిధర్‌కు కాంస్యం | Bronze medal to Shashidhar | Sakshi
Sakshi News home page

శశిధర్‌కు కాంస్యం

Sep 19 2017 12:22 AM | Updated on Sep 19 2017 4:44 PM

శశిధర్‌కు కాంస్యం

శశిధర్‌కు కాంస్యం

ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్‌ సీఎం శశిధర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్‌ సీఎం శశిధర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. కొచ్చిలో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల ప్లస్‌ 40 వయో విభాగంలో శశిధర్‌ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో శశిధర్‌ 21–5, 21–4తో వెగర్‌ నెస్‌ (నార్వే)పై గెలుపొందగా... రెండో రౌండ్‌లో 21–8, 21–11తో టాప్‌ సీడ్‌ లార్స్‌ కిన్‌ట్రప్‌ (డెన్మార్క్‌)ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్‌ ఫైనల్లో 21–10, 21–12తో ఐదో సీడ్‌ కొయెట్‌శ్రిపన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గిన శశిధర్‌... సెమీఫైనల్లో హొసెమారి ఫుజిమోటో (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.

ఇటీవలే జాతీయ సీనియర్‌ పోటీల్లో శశిధర్‌ ప్లస్‌ 40 వయో విభాగంలో స్వర్ణం గెలిచిన భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదిచాడు. ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో శశిధర్‌కిది రెండో పతకం కావడం విశేషం. 2013లో ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన ప్రపంచ పోటీల్లో శశిధర్‌ ప్లస్‌ 35 వయో విభాగంలో కాంస్యం సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement