52 నిమిషాల్లోనే ఖ‌తం.. ఫైన‌ల్లో సాత్విక్ జోడీ | Satwik-Chirag Stuns-World No-1 Enters-Final In Singapore Open 2026 | Sakshi
Sakshi News home page

Singapore Open: 52 నిమిషాల్లోనే ఖ‌తం.. ఫైన‌ల్లో సాత్విక్ జోడీ

May 30 2026 7:13 PM | Updated on May 30 2026 7:44 PM

Satwik-Chirag Stuns-World No-1 Enters-Final In Singapore Open 2026

సింగ‌పూర్ ఓపెన్‌లో భార‌త డ‌బుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. శ‌నివారం పురుషుల డ‌బుల్స్ సెమీస్‌లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్‌-సియో సుంగ్ జె జంట‌ను ఓడించింది. 

సాత్విక్‌-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైన‌ల్ చేర‌డంతో క‌నీసం ర‌జ‌తం ఖ‌రారు చేసుకున్న‌ట్ల‌యింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్‌లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్‌ల్లోనే జయభేరి మోగించింది. 

రేపు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో సాత్విక్‌-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.

చదవండి: అరుదైన ఫీట్‌.. టీమిండియా సర‌స‌న పాకిస్తాన్‌

Advertisement
 
Advertisement
Advertisement