అరుదైన ఫీట్‌.. టీమిండియా సర‌స‌న పాకిస్తాన్‌ | Pakistan Join India Massive Feat-Featuring 1000 ODI Match Vs Australia | Sakshi
Sakshi News home page

PAK Vs AUS: అరుదైన ఫీట్‌.. టీమిండియా సర‌స‌న పాకిస్తాన్‌

May 30 2026 6:40 PM | Updated on May 30 2026 7:22 PM

Pakistan Join India Massive Feat-Featuring 1000 ODI Match Vs Australia

రావ‌ల్పిండి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి వ‌న్డే పాకిస్తాన్‌కు 1000వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో వ‌న్డే క్రికెట్‌లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 

1075 వ‌న్డే మ్యాచ్‌లతో భార‌త్ జాబితాలో మొద‌టి స్థానంలో ఉండ‌గా, 1020 మ్యాచ్‌ల‌తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొన‌సాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల స‌ర‌స‌న పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ‌2ఆ  ప్ర‌త్యేక మెమొంటో అందుకున్నాడు. 

ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫ‌త్ మిన్హాస్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌డం మ‌రో విశేషం. వెయ్యి వ‌న్డేలు ఆడిన మూడు జ‌ట్లు విజ‌యాల శాతాన్ని ప‌రిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్‌ల్లో 617 విజ‌యాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండ‌గా, టీమిండియా (1075 మ్యాచ్‌ల్లో 571 విజ‌యాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్‌ల్లో 527 విజ‌యాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్‌షా (21) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

 

చదవండి: వినేశ్‌కు షాక్‌.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్‌!

Advertisement
 
Advertisement
Advertisement