‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ | India is not Just a Partner but co Traveler pm Modi | Sakshi
Sakshi News home page

‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ

Jul 3 2025 1:20 PM | Updated on Jul 3 2025 1:42 PM

India is not Just a Partner but co Traveler pm Modi

అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్‌ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి  ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్‌ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు.  

రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్‌.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
 

ఫిన్‌టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్‌-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.

ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement