
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి.
. ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
ఎమ్మెన్నెస్‌కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్‌పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.
ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు.
#WATCH | Mumbai | On a viral video of a shop owner in Thane assaulted for purportedly refusing to speak in Marathi, Maharashtra Minister Yogesh Kadam says, "In Maharashtra, you have to speak Marathi. If you don't know Marathi, your attitude shouldn't be that you won't speak… pic.twitter.com/kSXV1JekAn
— ANI (@ANI) July 3, 2025