భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్‌ వైరల్‌ | Doesnt Make Any Sense: Ronaldo Tearful Tribute To Diogo Jota Last Post Viral | Sakshi
Sakshi News home page

మర్చిపోలేని రోజు: పెళ్లి వీడియో షేర్‌ చేసిన గంటల్లోనే మృతి.. రొనాల్డో భావోద్వేగం

Jul 3 2025 5:59 PM | Updated on Jul 3 2025 6:30 PM

Doesnt Make Any Sense: Ronaldo Tearful Tribute To Diogo Jota Last Post Viral

లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్‌లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.

కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్‌బాల్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది.  

మర్చిపోలేని రోజు
ఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్‌ లైఫ్‌లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్‌ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల ‍క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం.

 

రొనాల్డో భావోద్వేగం
పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.

మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. డియోగో జోటా ఫొటో  షేర్‌ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది.

లివర్‌పూల్‌ తరఫున ఐదు టైటిళ్లు
లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున డియోగో జోటా ప్రీమియర్‌ లీగ్‌తో పాటు రెండు నేషన్స్‌ లీగ్‌ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్‌ఎల్‌ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్‌ ప్లేయర్‌ మృతి పట్ల లివర్‌పూల్‌ ఎఫ్‌సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని..  ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement