breaking news
Liverpool teams
-
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్‌పూల్ ఫుట్‌బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్‌బాలర్‌కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్‌లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్‌లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది.లివర్‌పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్‌తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్‌పూల్ ఎఫ్‌సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
చాంపియన్స్ లీగ్ విజేత లివర్‌పూల్
మాడ్రిడ్: మేటి యూరోపియన్ క్లబ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో లివర్‌పూల్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం మాడ్రిడ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో లివర్‌పూల్ (ఇంగ్లండ్) 2–0 గోల్స్ తేడాతో టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. లివర్‌పూల్ తరఫున మొహమ్మద్ సలా (2వ నిమిషంలో), డివోక్ ఒరిగి (87వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. విజేతగా నిలిచిన లివర్‌పూల్ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 147 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడం లివర్పూల్కిది ఆరోసారి. గతంలో ఆ జట్టు 1977, 1978, 1981, 1984, 2005లలో విజేతగా నిలిచింది. -
చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడమే ముఖ్యం
అర్సెనల్ తరఫున ఆడుతున్న మేసుట్ ఓజిల్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతను 12 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా ఈ జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో అర్సెనల్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో నేడు (ఆదివా రం) ఎవర్టన్తో ఆడనుంది. అయితే టాప్–4 కోసం అర్సెనల్, లివర్‌పూల్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్ర మే తేడా ఉంది. దీంతో అర్సెనల్ తమ మ్యాచ్ కచ్చితంగా నెగ్గడంతో పాటు... అటు మిడిల్స్బ్రోతో తలపడే లివర్‌పూల్ ఓడాల్సి ఉంటుంది. ఈనెల 27న ఎఫ్ఏ కప్ ఫైనల్లో తాము చెల్సీతో తలపడుతున్నప్పటికీ చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడంపైనే దృష్టి పెట్టామని జర్మనీ సూపర్‌స్టార్ ఓజిల్ చెబుతున్నాడు. నిజంగానే మీ జట్టు టాప్–4లో చోటు దక్కించుకుంటుందని భావిస్తున్నారా? అవును. చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించడం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో అర్సెనల్ కూడా ఉత్తమ క్లబ్లో ఒకటి. ఓ ఆటగాడిగా చాంపియన్స్ లీగ్‌లో ఆడటం ముఖ్యమని అనుకుంటున్నారా? నాకే కాదు మా ఆటగాళ్లందరికీ ముఖ్యమే. ఆ టోర్నీలో ఆడటమంటే ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లతో నిన్ను నీవు సరిచూసుకోవడమే. ఆటగాళ్లకే కాదు... మా అభిమానులకు కూడా కావాల్సిందిదే. అందుకే ఇది మాకు చాలా ముఖ్యం. నాలుగేళ్లుగా అర్సెనల్ తరఫున ఆడుతున్నారు. అప్పటి నుంచి చాంపియన్స్ లీగ్‌లోనూ ఆడారు. ఒకవేళ ఈసారి మిస్ అయితే ఎలా ఫీలవుతారు? ఇంకా మా ప్రయత్నం పూర్తి కాలేదు. అర్సెనల్ చాలా గొప్ప క్లబ్. మాకు అందులో ఆడే అర్హత ఉంది. అందుకే ఆ అవకాశం కోసం చాలా కష్టపడుతున్నాం. జట్టులో గొప్ప ఆటగాళ్లున్నా చాలాకాలం నుంచి ఈపీఎల్ టైటిల్ గెలవలేకపోతున్నారని అర్సెనల్‌పై విమర్శ ఉంది. అగ్రస్థానానికి ఎందుకు చేరలేకపోతోంది? ప్రతీ సీజన్లో మేం తొలి భాగమో.. లేకపోతే రెండో సీజన్లో మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నాం. నిజానికి టైటిళ్లు గెలవాలంటే ఇలాంటి ప్రదర్శన కాకుండా మొత్తం సీజన్ అంతా బాగా ఆడాల్సిందే. అదే మాకు సవాల్‌గా మారింది. అలాగే కీలక ఆటగాళ్ల గాయాలు... కొన్నిసార్లు దురదృష్టం కూడా మమ్మల్ని వెనక్కి నెట్టింది. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే మాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ విషయంలో మెరుగవ్వాల్సి ఉంది. జట్టు కోసం మీరు తగినంతగా కష్టపడటం లేదని కొందరు విమర్శిస్తున్నారు.. ఇది ఎంతవరకు నిజం? నా కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగి ఉండవచ్చేమో.. ఎందుకంటే నాకు అప్పుడు ఎలాంటి అనుభవం లేదు. అయితే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారనేది నాకు అనవసరం. నా కోచ్ మాటలే నాకు ముఖ్యం. నేను చేస్తున్న గోల్స్ అందరికీ సమాధానమిస్తాయి.