అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్‌ తీసుకుందా? | Film Star Kylie Page Dies At 28 In Los Angeles Home | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో అడల్ట్‌ ఫిల్మ్‌ స్టార్‌ మృతి!

Jul 3 2025 4:22 PM | Updated on Jul 3 2025 4:47 PM

Film Star Kylie Page Dies At 28 In Los Angeles Home

ప్రముఖ అడల్ట్‌ ఫిల్మ్‌ స్టార్‌ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్‌ 25న ఆమె లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్‌ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్‌. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement