ఎడిసన్‌లో అతిపెద్ద బౌలింగ్‌ కేంద్రం ప్రారంభం | Albatross Launches Worlds Largest Indoor Themed Mini Putting Bowling Destination in Edison New Jersey | Sakshi
Sakshi News home page

ఎడిసన్‌లో అతిపెద్ద బౌలింగ్‌ కేంద్రం ప్రారంభం

Jun 27 2025 7:22 PM | Updated on Jun 27 2025 7:50 PM

Albatross Launches Worlds Largest Indoor Themed Mini Putting Bowling Destination in Edison New Jersey

ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ మినీ పుట్టింగ్‌, లగ్జరీ బౌలింగ్ గమ్యస్థానమైన అల్బాట్రోస్ న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఇందులో ఎడిసన్ మేయర్ శామ్ జోషి, స్థానిక నాయకులు, మీడియా, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.

ఎడిసన్‌లోని 991 యుఎస్-1 వద్ద ఏర్పాటైన అల్బాట్రోస్ న్యూజెర్సీలో సామాజిక వినోదానికి ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పరుస్తుంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది అద్భుతమైన థీమ్డ్ మినీ పుట్టింగ్‌, అప్‌స్కేల్‌ బౌలింగ్, ఎలివేటెడ్ డైనింగ్, క్రాఫ్ట్ కాక్టెయిల్స్ వంటి హంగులతో సాయంత్రం వేళ ఆటవిడుపును మరింత హుషారుగా మారుస్తుంది.

"మా గ్రాండ్ ఓపెనింగ్ ఒక అద్భుతమైన వేడుక, చివరికి అల్బాట్రోస్లోకి అతిథులను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అల్బాట్రోస్ ఎన్‌జె ప్రెసిడెంట్‌ స్టీఫెన్ సాంగర్మానో అన్నారు. "ఇది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు- ఇది మరచిపోలేని సాటిలేని విధంగా రూపొందించబడిన సామాజిక ఆటస్థలం. మినీ పుటింగ్, లగ్జరీ బౌలింగ్ నుంచి క్రాఫ్ట్ కాక్టెయిల్స్, వైబ్రెంట్ డైనింగ్, లైవ్ డీజేల వరకు ఎక్కడా ఇలాంటివి లేవు’ అన్నారు.

"ప్రపంచ స్థాయి వినోదం, 350 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్న అల్బాట్రోస్ ఎడిసన్‌కు గేమ్ ఛేంజర్. మా మొత్తం కమ్యూనిటీకి శక్తిని తెస్తోంది" అని ఎడిసన్ మేయర్ సామ్ జోషి అన్నారు. "175,000 డాలర్ల అంచనా పన్నులతో మా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు కనెక్ట్ కావడానికి, ఆనందించడానికి నూతన, ఉత్తేజకరమైన ప్రదేశాన్ని అందించే గమ్యస్థానానికి స్వాగతం పలకడం నిజంగా ఉత్తేజకరమైనది. ఎడిసన్ ఇంత డైనమిక్, సృజనాత్మక వేదికకు నిలయంగా ఉండటం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement