breaking news
Putting
-
ఎడిసన్‌లో అతిపెద్ద బౌలింగ్ కేంద్రం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ మినీ పుట్టింగ్, లగ్జరీ బౌలింగ్ గమ్యస్థానమైన అల్బాట్రోస్ న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఇందులో ఎడిసన్ మేయర్ శామ్ జోషి, స్థానిక నాయకులు, మీడియా, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.ఎడిసన్‌లోని 991 యుఎస్-1 వద్ద ఏర్పాటైన అల్బాట్రోస్ న్యూజెర్సీలో సామాజిక వినోదానికి ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పరుస్తుంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది అద్భుతమైన థీమ్డ్ మినీ పుట్టింగ్, అప్స్కేల్ బౌలింగ్, ఎలివేటెడ్ డైనింగ్, క్రాఫ్ట్ కాక్టెయిల్స్ వంటి హంగులతో సాయంత్రం వేళ ఆటవిడుపును మరింత హుషారుగా మారుస్తుంది."మా గ్రాండ్ ఓపెనింగ్ ఒక అద్భుతమైన వేడుక, చివరికి అల్బాట్రోస్లోకి అతిథులను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అల్బాట్రోస్ ఎన్జె ప్రెసిడెంట్ స్టీఫెన్ సాంగర్మానో అన్నారు. "ఇది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు- ఇది మరచిపోలేని సాటిలేని విధంగా రూపొందించబడిన సామాజిక ఆటస్థలం. మినీ పుటింగ్, లగ్జరీ బౌలింగ్ నుంచి క్రాఫ్ట్ కాక్టెయిల్స్, వైబ్రెంట్ డైనింగ్, లైవ్ డీజేల వరకు ఎక్కడా ఇలాంటివి లేవు’ అన్నారు."ప్రపంచ స్థాయి వినోదం, 350 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్న అల్బాట్రోస్ ఎడిసన్‌కు గేమ్ ఛేంజర్. మా మొత్తం కమ్యూనిటీకి శక్తిని తెస్తోంది" అని ఎడిసన్ మేయర్ సామ్ జోషి అన్నారు. "175,000 డాలర్ల అంచనా పన్నులతో మా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు కనెక్ట్ కావడానికి, ఆనందించడానికి నూతన, ఉత్తేజకరమైన ప్రదేశాన్ని అందించే గమ్యస్థానానికి స్వాగతం పలకడం నిజంగా ఉత్తేజకరమైనది. ఎడిసన్ ఇంత డైనమిక్, సృజనాత్మక వేదికకు నిలయంగా ఉండటం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. -
వంటకాలతో వందకోట్ల టర్నోవర్..
భోజన ప్రియులను విభిన్న రకాల వంటకాలతో ఆకట్టుకున్న ఓ వ్యాపారి ఏకంగా కోట్లకు పడగలెత్తాడు. చవులూరించే రుచులతో ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకునేందుకు కుక్ ప్యాడ్ వెబ్సైట్ ను స్థాపించి.. ఇప్పుడు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పే జపాన్ లో జపనీస్ పారిశ్రామికవేత్త అకిమిస్తు సానో.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రాంతీయ జపనీస్ ప్రత్యేక వంటకాలలు భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రిల్డ్ స్క్విడ్, పాన్ కేక్స్ తో పాటు... చీజ్ కేక్, పాస్తా, బోలోగ్ నీస్ వంటి 2.1 మిలియన్ల అన్యదేశ వంటకాలతో 58.8 మిలియన్ల వినియోగదారులతో 'కుక్ ప్యాడ్' కొనసాగుతోంది. జపనీయులు ఇంటి భోజనాన్ని ఆస్వాదించేందుకు రకరకాల రుచులను అందిస్తున్న కుక్ ప్యాడ్.. జపాన్ లో అత్యంత ఎక్కువమంది వీక్షించే వెబ్‌పైట్లలో 55వ స్థానంలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో ఈ సంస్థ పన్నెండు రెట్లు విస్తరించింది. ఇంచుమించుగా జపాన్ మహిళల్లో సుమారు ఇరవైనుంచి ముఫ్ఫై సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో సగంకంటే ఎక్కువ మంది కుక్ ప్యాడ్ ను సందర్శిస్తుంటారు. 1997 లో సానో స్థాపించిన ఈ కుక్ ప్యాడ్..ఎంతో ప్రజాదరణ పొంది 2009 నాటికి 80శాతం రెవెన్యూ పెంచుకుంది. గతేడాది 65 మిలియన్ డాలర్ల కు చేరిన రెవెన్యూ సుమారు 19 మిలియన్ డాలర్ల లాభాలను మిగుల్చుకుంది. గత నెల దీని షేర్లు కూడ 20 శాతం పెరిగి, కంపెనీలో సానో వాటాను 44శాతానికి పెంచడంతోపాటు... కంపెనీ మొత్తం విలువ వంద కోట్లకు చేరింది. అత్యంత అరుదుగా మీడియా ముందుకు వచ్చే 42ఏళ్ళ సానో... జపాన్ కీయో విశ్వవిద్యాలయంలో పట్టభద్రత పొంది కుక్ ప్యాడ్ లో పని ప్రారంభించాడు. 2012 లో అక్కడ సీఈవో పాత్రను వదిలిన సానో... ఆ తర్వాత ఆదాయ సముపార్జనపై దృష్టి సారించాడు. మనానో వెడ్డింగ్ పేరిట ఉన్న జపనీస్ వివాహ వేదిక రివ్యూ సైట్ ను, కుకుంబర్ టౌన్ అనే ఆమెరికాకు చెందిన ఓ ఆహార బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేసి, ఈ సంవత్సరంలో లెక్కలేనంత ఆదాయాన్ని చేజిక్కించుకున్నాడు. పూర్వం చదువు లేకుండానే వంట జ్ఞానాన్ని ఎలా పొందారో తెలియదుకానీ, ఇప్పటి వారు వంటలు చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదని, అయితే రుచికరమైన వంటకాలు కుటుంబాలను సమష్టిగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయని సానో గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సానో..అతని భార్య వారి కెంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఓ చిన్నపాటి పరిశ్రమలా కనిపించే సంప్రదాయ పాకశాలలో(వంటిల్లు) ప్రతిరోజూ విధిగా ఉద్యోగులకు స్వయంగా వండి పెడుతుంటారట. అంతేకాక సానో తనకు కావలసిన, సమీప బంధువులు వండిన వంటకాలనే భుజిస్తాడని కూడా అతని గురించి బాగా తెలిసినవారు చెప్తుంటారు.