
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్' వెబ్ సిరీస్ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వర్షన్‌లో స్ట్రీమింగ్ కానుంది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమిత్ సియాల్‌తో పాటు సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.
హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh)- హీరో సుహాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' (Thug life) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం, కన్నడలో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన ‘గుడ్‌వైఫ్’ (Good Wife) వెబ్‌సిరీస్ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్ రాజ్ నటించారు. 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ 'ది గుడ్‌వైఫ్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను ఇండియాలో తెరకెక్కించారు.