
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.
కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు
ఈ మ్యాచ్‌లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. గిల్ కెప్టెన్‌గా తన మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..
గిల్-269
కోహ్లి-254 నాటౌట్ (2019)
కోహ్లి-243 (2017)
కోహ్లి-235 (2016)
ధోని-224 (2013)
టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..
వీరేందర్ సెహ్వాగ్ - 319
వీరేందర్ సెహ్వాగ్ - 309
కరుణ్ నాయర్ - 303*
వీరేందర్ సెహ్వాగ్ - 293
వీవీఎస్ లక్ష్మణ్ - 281
రాహుల్ ద్రవిడ్ - 270
శుభ్‌మన్ గిల్ - 269
ఇంగ్లండ్‌లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..
311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964
277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్‌బాస్టన్, 2003
269 - శుభ్‌మన్ గిల్ (IND), ఎడ్జ్‌బాస్టన్, 2025
259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003
విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..
309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004
270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004
269 - శుభ్‌మన్ గిల్ vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2025
254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006
గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్..
సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..
ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు..
సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు..
విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్..
ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు..
టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్
మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్‌దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు.
యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్‌దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు.