
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం గిల్ సేన తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కమంలో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లి, రోహిత్ స్ధానాలను భర్తీ చేసే అద్బుత ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులో ఉన్నారని గూచ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి దిగ్గజాల స్ధానాలను భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. కానీ టీమ్ మెన్‌జ్‌మెంట్ ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి.
"భారత క్రికెట్‌లో కొత్త యుగం మొదలైంది. నా వరకు అయితే.. ఒక దారి మూసుకుపోతే, మరో దారి తెరుచుకుంటుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు.
అయితే బుమ్రా అన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితులలోనైనా అతడిని ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.
కానీ కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శలనతో ముందుకు రావాలి. ఇక భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావించాలి. శుబ్‌మన్ గిల్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూచ్ పేర్కొన్నాడు.
చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్