దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు | NATS free bus for disabled students | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు

Jun 27 2025 2:17 PM | Updated on Jun 27 2025 3:52 PM

NATS free bus for disabled students

తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విశాఖలో దివ్యాంగుల కోసం నాట్స్ ఉచిత బస్సును ఏర్పాటు చేసింది. నాట్స్ స్థానిక స్వచ్చంద సంస్థ గ్లోతో కలిసి విశాఖలోని దివ్యాంగుల పాఠశాల సన్‌ ప్లవర్ స్కూల్‌ కోసం ఈ బస్సు కోనుగోలుకు కావాల్సిన ఆర్ధిక సహాకారాన్ని అందించింది. విశాఖ ఎంపీ భరత్‌ ఈ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ ప్రశంసించారు.
 
నాట్స్ సంబరాల్లో భాగంగా సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే కార్యక్రమం కింద సంబరాల్లో వచ్చిన మొత్తంలో 10శాతం ఇలా సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. దానిలో భాగంగానే న్యూజెర్సీలో జరిగిన సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖలో దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్‌కి తన చేయూత అందిస్తోంది. నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్, ఎవల్యూజ్ సంస్థ అధినేత శ్రీనివాస్ అరసాడ కూడా ఈ దివ్యాంగ పాఠశాలకు కావాల్సిన ఆర్థిక చేయూత అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement