
సాక్షి,ఢిల్లీ: ప్రజాగ్రహంతో ఢిల్లీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) వెహికల్ పాలసీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పాత వాహనాలపై నిషేధంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు నష్టపోకుండా.. ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
వాహనం వయస్సు ఆధారంగా కాకుండా వాతావరణం కాలుష్యం చేసే వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. వాహనాల కాలుష్యం విషయంలో యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఢిల్లీతో పాటు ఇతర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.
క్వాలిటీ ఎయిర్ మేనేజ్మెంట్ నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు పాలసీ అమలును నిలిపి వేయనుంది. ఇది వాహన యజమానులకు తాత్కాలిక ఊరట కలిగించినా, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది.
Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi
"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes— ANI (@ANI) July 3, 2025