
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్‌లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
కాగా గిల్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.
విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..
అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.
👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.
🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..
🏏శుబ్‌మన్ గిల్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..
🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..
🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...
500 పరుగుల మార్కు దాటిన టీమిండియా
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు