breaking news
Mansur Ali Khan Pataudi
-
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్‌మన్ గిల్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’
ఇంగ్లండ్- భారత్ మధ్య టెస్టు సిరీస్‌కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఫారూఖ్ ఇంజనీర్ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్‌కూ ఆడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.గొప్ప కుటుంబంకాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్‌కు టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్ ఇంజనీర్ అన్నాడు. ‘‘టైగర్ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండిఅయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్- టెండుల్కర్ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.మెడల్ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్ భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్‌కు అందజేయాలి. ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్ ఇంజనీర్ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్‌కు కుమారుడు సైఫ్‌తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం రెండో మ్యాచ్ (జూలై 2-6)కు వేదిక. చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
36 ఏళ్లు... 11 సిరీస్‌లు...
భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో విదేశాల్లో విజయం సాధించడమనేది మొదటి నుంచీ పెద్ద సవాల్‌గానే నిలిచింది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్లు ఉన్న సమయంలో కూడా విదేశాల్లో సిరీస్ విజయాలు మనకు అంత సులభంగా దక్కలేదు. ఈ రకంగా విదేశాల్లో భారత ప్రదర్శనను బట్టి చూస్తే తొలి సిరీస్ విజయం ఎప్పుడైనా అపురూపమే. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మధురక్షణమే. 1968లో న్యూజిలాండ్ గడ్డపై భారత్ విదేశాల్లో తమ తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1932లో భారత జట్టు ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. దాంతో కలిపి వరుసగా జరిపిన 11 విదేశీ పర్యటనల్లోనూ 10 సార్లు జట్టుకు సిరీస్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతుల్లో ఈ పరాజయాలు ఎదురుకాగా, స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్‌తో ఆడిన ఒక్క సిరీస్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. గెలుపు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. ఇలాంటి నేపథ్యంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు అద్భుత విజయం దక్కింది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత్ 4 టెస్టుల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకోవడం విశేషం. మన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సయ్యద్ ఆబిద్ అలీ, ఎంఎల్ జైసింహ ఈ సిరీస్ విజయంలో భాగంగా ఉన్నారు. ఈ నాలుగు టెస్టుల ఫలితాలను చూస్తే... తొలి టెస్టు (డ్యునెడిన్) భారత్ ఐదు వికెట్లతో విజయం డౌలింగ్ (143) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 350 పరుగులు చేసింది. ఆబిద్ అలీకి 4 వికెట్లు దక్కాయి. అజిత్ వాడేకర్ (80), ఫరూఖ్ ఇంజినీర్ (63) బ్యాటింగ్‌తో భారత్ 359 పరుగులు చేసింది. ఎరాపల్లి ప్రసన్న 6 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం రుచి చూసింది. రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్): న్యూజిలాండ్ ఆరు వికెట్లతో విజయం డౌలింగ్ (239) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ ముందుగా 502 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీకి 6 వికెట్లు దక్కాయి. భారత్ 288 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగలిగింది. 88 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి కివీస్ ఛేదించింది. మూడో టెస్టు (వెల్లింగ్టన్): భారత్ ఎనిమిది వికెట్లతో విజయం ఎరాపల్లి ప్రసన్న 5 వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే కుప్పకూలింది. భారత్ 327 పరుగులు చేసి భారీ ఆధిక్యం అందుకుంది. అజిత్ వాడేకర్ (143) శతకం సాధించడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మళ్లీ బ్యాటింగ్‌లో విఫలమై 199 పరుగులకే ఆలౌటైంది. బాపు నాదకర్ణి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. 59 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి సిరీస్‌లో ముందంజ వేసింది. నాలుగో టెస్టు (ఆక్లాండ్): భారత్ 272 పరుగులతో విజయం విదేశాల్లో భారత్ సిరీస్ విజయపు కలను నెరవేర్చిన మ్యాచ్ ఇది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు మాత్రమే చేసినా... న్యూజిలాండ్‌ను 140 పరుగులకే పడగొట్టింది. మరోసారి ప్రసన్న 4 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 261 వద్ద డిక్లేర్ చేసింది. రూసీ సుర్తీ 99 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 374 పరుగుల అసాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ సొంతగడ్డపై చేతులెత్తేసింది. 101 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రసన్న 4, బేడీ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. భారత్ చరిత్రాత్మక సిరీస్ విజయంలో అజిత్ వాడేకర్ 328 పరుగులతో మన తరఫున టాప్ స్కోరర్‌గా నిలవగా...సుర్తీ, ఫరూఖ్ ఇంజినీర్ చెరో 321 పరుగులు సాధించారు. ఏకైక సెంచరీని వాడేకర్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో 24 వికెట్లతో ఎరాపల్లి ప్రసన్న ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా... బిషన్ సింగ్ బేడీ 16, బాపు నాదకర్ణి 14 వికెట్లతో అండగా నిలిచారు. –సాక్షి క్రీడా విభాగం -
తాతలా...
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల తనయుడు తైముర్ అలీఖాన్ చాలా పాపులర్. తైముర్ కూడా వాళ్ల తల్లీదండ్రుల్లా సినిమా ఫీల్డ్‌లోనే ఉంటాడు అనుకుంటారు ఎవరైనా. కానీ కరీనా మాత్రం తైముర్ వాళ్ల తాతలా క్రికెటర్ కావాలనుకుంటున్నారు. తైముర్ తాతయ్య సైఫ్ అలీ ఖాన్ నాన్న మన్సూర్ అలీఖా¯Œ పటౌడి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్. ఇంతకీ తైముర్ వాళ్ల అమ్మనాన్నల్లా ఇండస్ట్రీలో హీరోగా బాక్సాఫీస్ బద్దలు కొడతాడా? అమ్మ కోరినట్టు క్రికెటర్‌గా బౌండరీలు బాదుతాడా? అనేది తెలియాలంటే ఇంకా కనీసం పదీ పదిహేనేళ్లయినా ఆగాల్సిందే. -
మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!
బ్రిస్బేన్: మహేంద్ర సింగ్ ధోనీ..టీమిండియాకు ఘనమైన విజయాలు అందించిన కెప్టెన్. ఇటు కెప్టెన్ గాను, అటు ఆటగాడిగాను తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇదేదో బ్యాట్ తో పరుగులు చేసి కొత్తగా నమోదు చేసిన రికార్డు కాదు. ధోనీ డకౌట్ల రికార్డు. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో డకౌట్ కావడంతో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ధోనీ డకౌట్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ ఖాతాలో రికార్డు వచ్చి చేరింది. భారత కెప్టెన్ గా ఎనిమిదిసార్లు డకౌటయిన ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు.అంతకుముందు ఈ రికార్డు మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరు మీద ఉంది. భారత కెప్టెన్ గా పటౌడీ ఏడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు.