జానీ మాస్టర్‌ ఎఫెక్ట్‌.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు | Nayanthara And Vignesh Shivan under fire for collaborating with choreographer Johnny Master | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌ ఎఫెక్ట్‌.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు

Jul 3 2025 2:35 PM | Updated on Jul 3 2025 3:16 PM

Nayanthara And Vignesh Shivan under fire for collaborating with choreographer Johnny Master

మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో   ఆయన కొంతకాలం జైలులో ఉండి  బెయిల్‌పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్‌లు తమ సినిమా కోసం  కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని  వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్‌ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.

నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్‌ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్‌ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్‌గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్‌లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్‌ దొరకలేదా..? అంటూ విమర్శించారు.

నేరస్థులకే ఛాన్సులు: చిన్మయి
కోలీవుడ్‌ టాప్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్‌ అయ్యారు. జానీ మాస్టర్‌, విఘ్నేష్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము.  మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.

చిన్మయి చేసిన ఈ పోస్ట్  వైరల్ అయింది. ఆన్‌లైన్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్‌ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement