
తెలుగులో రెండు సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్‌పై పోలీస్ కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నాడని ఇతడి భార్యనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?
(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)
సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్.. 2019లో గౌతమి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. గతంలో ఓసారి ఇతడిపై వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యని ఇదే విషయమై వేధింపులకు గురిచేస్తుండటంతో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.
సినిమా ఛాన్సులు పెరగడంతో తన భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఇతడి భార్య.. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకటి రెండు చిత్రాలతో కాస్తోకూస్తో గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో ఇలా పోలీసు కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)