
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్‌మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.
ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.