
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం గంటపాటు జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం ‘విక్రమ్ సంవత్ 2082’ తొలిరోజున సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 84,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 25,869 వద్ద నిలిచింది. ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు ఉత్సాహంగా కదలాయి.
ఒక దశలో సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగసి 84,665 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,934 గరిష్టాన్ని నమోదు చేశాయి. చివర్లో బ్యాంకులు, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సూచీలు మధ్యాహ్నం 2:45 గంటకు స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
⇒ దీపావళి బలిప్రతిపద సందర్భంగా బుధవారం(నేడు) మార్కెట్‌కు సెలవు. ఎంసీఎక్స్, ఫారెక్స్ మార్కెట్లు సాయంత్రం సెషన్‌లో పనిచేస్తాయి.