ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.




కారణాలివేనా..?
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్‌ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.

మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్‌లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్‌గా ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్‌కు దారితీస్తున్నట్లు నిపుణులు వివరించారు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


