
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం హైదారబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ యశోదా ఆస్పత్రి వైద్యులతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.