
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగులు సూపర్‌హిట్టయ్యాయి. మార్కెట్ అనిశ్చితుల్లోనూ అదిరిపోయే అరంగేట్రం చేసి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలు పంచాయి. హెచ్‌డీబీ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర(రూ.740)తో పోలిస్తే బీఎస్‌ఈలో 13% ప్రీమియంతో రూ.835 వద్ద లిస్టయ్యింది.
ఇంట్రాడేలో 15% ఎగసి రూ.850 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14% లాభంతో రూ.841 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.69,758 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రెండో రోజూ గురువారం లాభాలను కొనసాగించింది. రూ.890 వరకూ పెరిగి రూ.865 వద్ద ముగిసింది.
సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగూ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.82)తో పోలిస్తే బీఎస్‌ఈలో 34% ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యిది. ట్రేడింగ్‌లో 35% పెరిగి రూ.111 వద్ద గరిష్టాన్ని తాకింది. గరిష్టాల వద్ద స్వల్ప లాభాలు చోటు చేసుకున్నప్పటికీ.., చివరికి 19% లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,875 కోట్లుగా నమోదైంది.