
మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..
68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్‌మాన్ అనే డచ్ మహిళ కశ్మీర్ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్‌లోని దాల్ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్‌తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట.
దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్‌లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా.
ఆ వీడియోలో ఎల్లిస్ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె.
స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి, లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా.
Kudos to Dutch national Ellis Hubertina Spaanderman for her selfless efforts in cleaning Srinagar's Dal Lake for past 5 years. This dedication serves as an inspiration to preserve Kashmir's natural beauty. Let's join hands to keep our paradise clean & pristine. @ddprsrinagar pic.twitter.com/YINLbm3X1z
— Kashmir Rights Forum🍁 (@kashmir_right) June 29, 2025
(చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..)