
కుంభకర్ణుడిని తలదన్నేలా నిద్రపోయింది ఈ అమ్మాయి. అన్నేళ్లు నిద్ర అని ఆశ్చర్యపోకండి. ఆమెను మేల్కొలిపేందుకు ఎలక్ట్రిక్ షాక్, అగ్నితో కాల్చడం, సూదితో గుచ్చడం వంటి ప్రయత్రాలు కూడా ఉన్నాయట. అయినా ఆ ఆమ్మాయి లేవలేదు. పైగా 32 ఏళ్లు తర్వాత మేల్కొని నాటి సంగతులన్నీ వివరంగా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె స్టోరీ శాస్త్రవేత్తలకే ఓ పట్టాన అంతుపట్టని మిస్టరీలా అనిపించిందట. పోనీ ఏదైనా నిద్రకు సంబంధించిన జబ్బుగా నిర్ధారిద్దాం అనుకున్నా..దాన్ని కూడా మించిపోయేలా ఏకంగా మూడు దశాబ్దాల నిద్ర అని అంతా విస్తుపోతూ తలలు పట్టుకున్నారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..
ఈ ఘటన బాలిస్టిక్ ద్వీపం స్వీడిష్‌లోని ఓక్నోలో చోటుచేసుకుంది. ఇది 19వ శతాబ్దంలో రియల్‌గా జరిగిన ఘటన. దాని గురించి ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారట. మనం కథల్లో వింటుంటాం స్లీపింగ్ బ్యూటీ అంటూ అన్నేళ్లు నిద్రపోయిందట అని..కానీ ఇది రియల్ స్లీపింగ్ బ్యూటీ స్టోరీ. ఆ అమ్మాయి పేరు ఓల్సన్. ఆమె అక్టోబర్ 29, 1861న జన్మించింది. ఆమె తండ్రి మత్స్యకారుడు, తల్లి గృహిణి.
ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఇంటి పరిస్థితి అంతమాత్రమే కావడంతో ఆమెను పాఠశాలకు పంపించేవారు కాదు. అయితే ఓల్సన్‌కు చదువంటే మహా ఇష్టం కావడంతో అతికష్టంపై పంపించేవారు తల్లిదండ్రులు. అలా 14 ఏళ్ల వరకు క్రైస్తవ పాఠశాలలో చదువు కొనసాగించింది. ఫిబ్రవరి 18, 1876న శీతాకాలంలో ఎప్పటిలానే స్కూల్‌కి తిరిగి వస్తుంది.. అయితే తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో గడకట్టుకుపోయిన నదిని దాటే ప్రయత్నం చేసింది.
ఆ క్రమంలో జారిపడి తలకు గట్టిగా గాయలయ్యాయి. అలానే ఇంటకి చేరుకుంది. అయితే పేదరికం కారణంగా తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు చూపించలేకపోతారు. విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుందేలే అనుకున్నారు తల్లిదండ్రులు. అలా ఆ రోజు పడుకుంది ఇక లేవనే లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కూతుర్ని కంటికిరెప్పలా కాచుకునేది. ఏ రోజుకైనా లేగుస్తుందని ఆశగా అలానే చూసుకునేది.
రియల్ స్లీపింగ్ బ్యూటీ అంటూ ఆమె కథ ఆ గ్రామమంతా దావనంలా వ్యాపించింది. చాలామంది ఆమెను చూసేందుకు వచ్చేవారు కూడా. అంతేగాదు ఆమెను ఎలాగైనా నిద్ర నుంచి లేపాలని..సూదులతో గుచ్చడం, కరెంట్‌షాక్, కాల్చడం వంటివి ఎన్నో చేశారు. మొదట్లో వైద్యులు కోమా, హిస్టీరియా వంటివేమో అనుకున్నారు గానీ..వైద్య పరీక్షల్లో అవేమి కాదని తేలింది. దాంతో వాళ్లు కూడా చిక్కిత్స అందించలేమని చేతులెత్తేశారు.
అలా ఓల్సన్ మూడు దశాబ్దలుగా గదిలో నిద్రపోతూనే ఉంది. ఆమె తల్లి 1904 మరణించింది. అప్పటి వరకు ఓల్సన్ బాధ్యతను ఆమెనే దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత తండ్రి ఒక పనిమనిషిని నియమించి ఆమె బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. అయితే పనిమనిషి ఆహారం అదృశ్యమైపోతుందంటూ ఫిర్యాదు చేస్తుండేది. నిజానికి ఓల్సన్ నిద్రలోనే ఉన్నా..వాస్తవిక జీవితాన్ని దగ్గరగా గమినిస్తున్నట్టుగా ఉండేది ఆమె తీరు. ఆమె సోదరుడు మరణించిన సమయంలో కూడా ఏడుస్తున్నట్లు మూలుగు వినిపించిందట. ఆమె తన కలకు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చుట్టూ ఉన్నవారికి అనిపించేదట.
సరిగ్గా 32 ఏళ్ల తర్వాత మేల్కొలుపు..
అలా గాఢ నిద్రలోనే ఉండిపోయిన ఓల్సన్ 1908లో అప్పుడే నిద్రలోంచి మేల్కొన్నట్లుగా మేల్కొంది. ఒక పెద్ద ఏడుపు శబ్బం రావడంతో పనిమనిషి గదిలోకి రాగా ఓల్సన్ మేల్కొని ఏడుస్తూ కనపించింది. 14 సంవత్సరాల ప్రాయంలో పడుకున్న ఆమె మళ్లీ తిరిగి 46 ఏళ్ల వయసుకి మేల్కొంది. అత్యంత బలహీనంగా అయోమయంగా కుటుంబసభ్యులందర్నీ చూసింది.
తన సోదరులను గుర్తించలేకపోయింది. అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే..1876 ఫిబ్రవరిలో జరిగిన ప్రతి సంఘటన ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత సంత్సారాల గురించి ఆమెకు తెలియదు. ఓల్సన్ స్టోరీ విలేకరులనూ, వైద్యులనూ ఆకర్షించడమే కాదు అత్యంత వింతగా అనిపించింది. ఆమె శరీరం అంతగా వృద్ధాప్యం చెందలేదు కూడా. శారీరకంగా ఆరోగ్యంగా తెలివిగానే ఉంది. అయితే కాంతికి బహిర్గతం కావడంలో ఇబ్బంది పడింది.
కొందరు వైద్యులు ఆమెకు జరిగిన మానసిక గాయం వల్ల ఇలా గాఢ నిద్రలోకి చేరుకుందని, తల్లి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మెరుగపడిందని అన్నారు. శాస్త్రవేత్తలకు కూడా ఆమె స్టోరీ అంతుచిక్కని మిస్టరీలా తోచింది. ఎందుకంటే ఆమె నిద్రను స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్‌గా నిర్థారిద్దాం అనుకున్నా..ఓల్సన్ కేసు అందుకు విరుద్ధం. ఎందుకుంటే అంత సుదీర్ఠ నిద్ర ఈ వ్యాధి లక్షణం కాదు.
టీనేజ్ వయసులో పడుకుని మద్య వయసులో మేల్కోన్న ఈ అమ్మాయి కథ నేటికి అక్కడొక మిస్టరీ, ఆసక్తిని రేకెత్తించే కథ. ఓల్సన్ 1950 88 ఏళ్ల వయసులో మరణించిందట. అయితే ఇంతవరకు ఆమె అంత సుదీర్ఘ నిద్రలోకి ఎందుకు జారుకుందనేది ఎవ్వరూ నిర్థారించలేకపోయారట.
(చదవండి: సుదీర్ఘ దాంపత్యానికి బ్రేకప్ చెబితే ఫలితం ఇలా ఉంటుందా..? పాపం ఆ 60 ఏళ్ల వ్యక్తి..)