
కొరియన్ వ్యక్తి కొరియన్ భాష నేర్పించడం వింత కాదు. భోజ్‌పురి నేర్పించడమే వింత. యెచన్ సి లీ అనే కొరియన్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. పిల్లలకు సరదాగా భోజ్‌పురి నేర్పిస్తుంటాడు. యెచన్ సి లీ పిల్లలకు భోజ్‌పురి నేర్పిస్తున్న వీడియో వైరల్ అయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌కు లక్షలాది వ్యూస్ వచ్చాయి. పిల్లలు భోజ్‌పురి వాక్యాలను ఆసక్తిగా నేర్చుకోవడం మరో విశేషం. ‘కొరియన్ పిల్లలకు భోజ్‌పురి నేర్పించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను’ అని తన వీడియోకు కాప్షన్ ఇచ్చాడు లీ.
మొదటిసారి ఎవరినైనా కలిసినప్పుడు భోజ్‌పురిలో ఎలా పలకరించాలి? మరోసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఎలా పలకరించాలి?... మొదలైనవి పిల్లలకు నేర్పిస్తుంటాడు లీ. ‘అమేజింగ్ వర్క్’ అంటూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ‘లీ’ భోజ్‌పురి ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో తెలియదుగానీ అతడి భోజ్‌పురి పాఠాలు ఆన్‌లైన్ హార్ట్‌ను దోచుకున్నాయి.
(చదవండి: ఇది స్త్రీరామ రక్ష..!)