
గురువు అన్న పదమే ఎంతో గౌవరనీయమైనది. ఇక ఆ స్థానాన్ని అలకంరించి.. ఎందరో విద్యార్థులను మేధావులగా తీర్చిదిద్దే వాళ్ల సేవ అజరామరం. అలాంటి వ్యక్తులు బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పుతున్నంత బాధ కలగడం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులెందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలిపై వెళ్తుతన్న ఓ మహిళా టీచర్‌కి విద్యార్థుల తోపాటు యావత్తు గ్రామం కన్నీటి వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకెళ్తే..బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో రేఖ అనే టీచర్ 22 ఏళ్లుగా టీచర్ పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులను మంచి విద్యను బోధించడమే గాక ఆ గ్రామంలోని గ్రామస్తులుకు విద్య ప్రాముఖ్యత అవగాహన కల్పించేవారామె. గత 22 ఏళ్లుగా ఆ గ్రామంలో తన బోధన సేవతో గ్రామస్తులు, విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు బదిలిపై స్కూల్‌ని వీడక తప్పని పరిస్థితి.
అయితే ఆమె లాస్ట్ వర్కింగ్ డే రోజున విద్యార్థుల తోపాటు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు కూడా వచ్చి కన్నటి సంద్రంతో భారంగా వీడ్కోలు పలికారు. అంతేగాదు ఆ రోజు ఫంగ్షన్ ఏర్పాటు చేసి..గ్రామస్తులంతా ఆమె సేవలను కొనియాడుతూ సన్మానించడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు.
ఇక వీడ్కోలు సమయానికి అంత ఆమె చుట్టుచేరి ఐ మిస్ యూ రేఖ మేడమ అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. మొత్తం గామ్రమే ఆమె వెళ్లిపోతుంటే కన్నీటి సంద్రంలో మునిగిపోయి నిట్టూర్చింది. ఆ ఘటన మొత్తం కంటెంట్ క్రియేటర్ రీకార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా అవసరం లేదు మన సేవాతత్పరత మనల్ని అందరికి చేరవయ్యేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుపెడుతుందంటూ సదరు టీచర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై)