
ఇండియాకు చెందిన సోహం పరేఖ్ మూన్‌లైటింగ్ చేస్తున్నాడంటూ కంపెనీలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటి
భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్‌లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ.
ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.
Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l
— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025
పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు.
PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.
I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్‌హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు.
అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు.
నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
అయితే తప్పేంటి?
మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్‌నిపుణురాలు ట్వీట్ చేశారు.