అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్‌ : నెట్టింట చర్చ | Indian Woman Held In US For Shoplifting Rs 1.11 Lakh In Items; Video Goes Viral | Sakshi
Sakshi News home page

అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్‌ : నెట్టింట చర్చ

Jul 16 2025 2:43 PM | Updated on Jul 17 2025 10:25 AM

Indian Woman Held In US For Shoplifting Rs 1.11 Lakh In Items; Video Goes Viral

భారతదేశానికి  చెందిన మహిళను దొంగతనం  ఆరోపణల కింద  అమెరికాలో అరెస్ట్‌ చేశారు. ఇల్లినాయిస్‌ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్‌గా మారింది.  తీవ్ర చర్చకు దారితీసింది.

స్టోర్ ఉద్యోగుల ప్రకారం,   విలువైన వస్తువులను  కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్‌లో సంచరిస్తూ, తన ఫోన్‌ను నిరంతరం తనిఖీ  చేసుకుంటూ కనిపించింది.  చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో  ఆమెను   అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై  డబ్బులు  చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన  దాన్ని కాదని,  తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. 

చదవండి: Vidya Balan మైండ్‌ బ్లోయింగ్‌.. గ్లామ్‌ అవతార్‌, అభిమానులు ఫిదా!

ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్‌ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం.  

నోట్‌:  అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement