
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.
తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.
అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు.